Omar Abdullah: మోదీ మాట నిలబెట్టుకోవడంతో సీఎం అయ్యా.. ఒమర్ అబ్దుల్లా
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని, ఆ హామీని సమర్థవంతంగా అమలు చేసి ఎన్నికలు నిర్వహించినట్లు అన్నారు.
మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, ప్రజలకు కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారన్నారు.
దీంతో నాలుగు నెలలలోపు ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో తనకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడని వెల్లడించారు.
Details
ఎక్కడా రిగ్గింగ్ జరగలేదు
జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని, ఎక్కడా రిగ్గింగ్ లేదా అధికార దుర్వినియోగం గురించి ఫిర్యాదులు లేవని చెప్పారు.
అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ త్వరలో నెరవేరుతుందని, తద్వారా జమ్మూకశ్మీర్ మళ్లీ భారత దేశంలోని ఒక రాష్ట్రంగా అవతరిస్తుందని తెలిపారు.
ప్రధాని మోదీ కృషి వల్ల సరిహద్దుల్లో శాంతి భద్రతలు ఏర్పడినట్లు ఒమర్ చెప్పారు.
పర్యటన రంగంలో కూడా కశ్మీర్ అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్ ప్రాంతంలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగం ప్రారంభం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Details
విద్యా, అభివృద్ధి వైపు అడుగులు
ఈ సొరంగం ప్రారంభంతో ఎగువ ప్రాంతాల ప్రజలు మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రహదారి ద్వారా చేరుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ మార్పు సోన్‌మార్గ్‌కు పర్యటకుల రాకను కూడా పెంచుతుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని, అక్కడి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.
కశ్మీర్ యువత రాళ్లను వదిలి విద్య, అభివృద్ధి వైపు వెళ్లాలని ఎదురుచూస్తున్నట్లు ఒమర్ చెప్పారు.