దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు
దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ సవరణ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారని ఆ రెండు ప్రార్టీలను ప్రశ్నించారు. ఈ బిల్లు చట్టంగా మారడం వల్లే కలిగి నష్టాన్ని ఆ రెండు పార్టీలకు పట్టడం లేదని మండిపడ్డారు. దిల్లీ సర్వీసెస్ అథారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దుతు ఇవ్వడంలో ఆశ్చర్యం లేదన్నారు. కానీ ఈ బిల్లులో ఏం మెరిట్స్ ఉన్నాయో తనకు అంతుపట్టడం లేదని, అలాగే ఇందులోని మెరిట్స్‌ను వైసీపీ, బీజేపీ రెండూ విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు.
త్రిసభ్య అథారిటీలో దిల్లీ సీఎం సభ్యుడు మాత్రమే: చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ సందర్భంగా బీజేడీ, వైఎస్సార్‌సీపీ పార్టీలకు పలు ప్రశ్నలు సంధించారు. దిల్లీ సర్వీస్ బిల్లు చట్టంగా మారిన తర్వాత కేంద్రం నియమించే త్రిసభ్య అథారిటీలో దిల్లీ సీఎం సభ్యునిగా మాత్రమే ఉంటారని, మిగిలిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులని చిదంబరం చెప్పారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు మెరిట్‌ను గుర్తించాయా? అడిగారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు అధికారులే కోరంను నిర్ణయిస్తారని, సీఎం లేకుండా ఈ ఇద్దరు అధికారులు నిర్ణయాలు కూడా తీసుకొచ్చనే నిబంధన వీరికి మెరిట్‌గా కనపడిందా? అని ప్రశ్నించారు. త్రిసభ్య అథారిటీ ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు తిరస్కరించే అధికారం ఉందని, ఇందులో మీకు మెరిట్ కనపడిందా? చిదంబరం అడిగారు.