JAMMU AND KASHMIR: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన జమ్ముకశ్మీర్
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సాధారణ ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పంచాయతీలు,పట్టణ స్థానిక సంస్థలు,జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జమ్ముకశ్మీర్ లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన 4,892 గ్రామ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. జమ్ముకశ్మీర్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం పంచాయతీ ఓటర్ల జాబితాల వార్షిక సారాంశ సవరణ కోసం ప్రత్యేక ప్రచారాన్ని జనవరి 15న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రచారం లక్ష్యం అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బిఆర్ శర్మ తెలిపారు.
ఫిబ్రవరి 26న సవరించిన ఓటర్ల జాబితా
"పంచాయితీ ఓటర్ల జాబితాల వార్షిక సారాంశ సవరణను చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇది 18 ఏళ్లు (వయస్సు) నిండిన బాలబాలికలను..జనవరి 1, 2024న పంచాయితీ జాబితాలో చేర్చడానికి," అని శర్మ అన్నారు. ప్రచారం జనవరి 15న ప్రారంభమై ఫిబ్రవరి 5 వరకు కొనసాగుతుందని, ప్రచారంలో భాగంగా జనవరి 27, 28, ఫిబ్రవరి 3, 4 తేదీల్లో నాలుగు క్యాంపులు నిర్వహిస్తామని, సవరించిన ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 26న ప్రచురిస్తామని శర్మ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎందుకు పాల్గోవాలో నొక్కిచెప్పిన శర్మ, అర్హులైన వారు ఓట్ కోసం నమోదు చేసుకోవాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ ఎన్నికలను బీజేపీ వాయిదా వేసిందని ఆరోపించిన కాంగ్రెస్
అంతకుముందు, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 రాజ్యాంగ చెల్లుబాటుపై తీర్పును వెలువరిస్తూ, అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్ 2024 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. ఇదిలా ఉండగా, జమ్ముకశ్మీర్ లో ఎన్నికలలో ఓటమి భయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. ఎన్నికల జాప్యం వల్ల కేంద్ర పాలిత ప్రాంతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పతనమైందని కాంగ్రెస్ ఆరోపించింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది: రవీందర్ శర్మ
జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జేకేపీసీసీ) ముఖ్య అధికార ప్రతినిధి రవీందర్ శర్మ మాట్లాడుతూ.. జే-కేలో పంచాయితీల గడువు ముగియడం వల్ల నేడు పంచాయతీ రాజ్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ఓటమి భయంతో బీజేపీ ఉద్దేశపూర్వకంగానే పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేసిందన్నారు. జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉందని రవీందర్ శర్మ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. పంచాయతీలకు ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నందున, ప్రజల ఆకాంక్షలు, హక్కులను బీజేపీ విస్మరించిందని కాంగ్రెస్ ఆరోపించింది.