UCC: ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్‌లోనూ సివిల్ కోడ్ అమలు దిశగా ముందడుగు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 24, 2026
04:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు ముందడుగు పడింది. 2026 బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ప్రత్యేకంగా ఏర్పరిచిన కమిటీ ఇటీవల తుది నివేదిక సమర్పించిన తర్వాత, సీఎం భూపేంద్రపటేల్ ఈ బిల్లును గుజరాత్ అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ బిల్ ఆమోదం పొందితే, గుజరాత్ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా నిలుస్తుంది. ఇంతకుముందు, ఫిబ్రవరి 2024లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించి, అమలు ప్రారంభించింది.