Madya Pradesh : పోర్న్ చూసి చెల్లెలుపై అత్యాచారం.. అపై తల్లితో కలిసి హత్య
ఈ వార్తాకథనం ఏంటి
ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసి చెల్లిపై అత్యాచారానికి పాల్పడి, అపై ఆ చిన్నారిని తల్లితో కలిసి బాలుడు హతమార్చిన ఘటన సంచలనం రేపుతోంది.
మూడు నెలల కిందట మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనను కప్పిపుచ్చడానికి బాలుడి తల్లి, ఇద్దరు అక్కలు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
బాలిక మృతదేహాన్ని ఇంటి పరిసరాల్లో పోలీసులు గుర్తించారు.
Details
పోలీసుల అదుపులో బాలుడు, తల్లి
ఫోర్న్ వీడియోలు చూసి బాలుడు చెల్లి పక్కనే పడుకున్నానని, అనంతరం ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె వచ్చి చూసేసరికి బాలిక ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కన్నకూతురి గొంతు నులిమి ప్రాణం తీసింది.
ఇక విషపురుగు కరిచి బాలిక చనిపోయిందని తల్లి నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
బాలుడిని, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.