LOADING...
AI Express pilot: ప్రయాణీకుడిపై దాడి కేసులో AI ఎక్స్‌ప్రెస్ పైలట్ అరెస్టు, బెయిల్‌పై విడుదల
ప్రయాణీకుడిపై దాడి కేసులో AI ఎక్స్‌ప్రెస్ పైలట్ అరెస్టు, బెయిల్‌పై విడుదల

AI Express pilot: ప్రయాణీకుడిపై దాడి కేసులో AI ఎక్స్‌ప్రెస్ పైలట్ అరెస్టు, బెయిల్‌పై విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజీఐ) ఇటీవల స్పైస్‌జెట్‌ ప్రయాణికుడిపై జరిగిన దాడి ఘటనలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ వీరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలపై జరగిన దర్యాప్తు అనంతరం ఈ చర్య తీసుకున్నట్టు అదనపు పోలీస్ కమిషనర్ విచిత్ర వీర్ తెలిపారు. అరెస్ట్‌ అనంతరం వీరేంద్రకు వెంటనే బెయిల్‌ మంజూరైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ పైలట్‌ ను ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. దాడి గురించి ప్రయాణికుడు అంకిత్ దివాన్‌ సోషల్ మీడియా ద్వారా వివరాలు పంచుకున్నాడు.

వివరాలు 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు  ఆదేశాలు 

తన కుటుంబంతో కలిసి స్పైస్‌ జెట్‌ విమానంలో ప్రయాణించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పుడు, టెర్మినల్‌-1లో సెక్యూరిటీ చెక్‌-ఇన్ వద్ద లైన్‌లో ఉండగా కొందరు మధ్యలోకి రాకపోవడంపై ప్రశ్నించానని అంకిత్ వెల్లడించారు. ప్రశ్నించినందుకు గాను , ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ వీరేంద్ర సెజ్వాల్‌ దుర్భాషలు పలికినప్పటికి, భౌతిక దాడి కూడా చేశారని అంకిత్‌ ఫిర్యాదు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement