LOADING...
Tamil Nadu : తమిళనాడు ప్రచారంలో ఏఐ హవా.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్న నేతలు
తమిళనాడు ప్రచారంలో ఏఐ హవా.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్న నేతలు

Tamil Nadu : తమిళనాడు ప్రచారంలో ఏఐ హవా.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్న నేతలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకూ కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ నేతలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు టెక్నాలజీ వైపు మళ్లాయి. ప్రచారంలో ఏఐ వినియోగం సరికొత్త సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK) అభ్యర్థులు వినియోగిస్తున్న టెక్నాలజీ చర్చనీయాంశంగా నిలిచింది. సినిమాల ద్వారా విపరీతమైన అభిమానాన్ని సంపాదించిన విజయ్, రాజకీయాల్లోనూ అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. అయితే సమయాభావం కారణంగా ప్రతి నియోజకవర్గానికి వ్యక్తిగతంగా వెళ్లడం సాధ్యం కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా టీవీకే అభ్యర్థులు 'హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్' అనే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

వివరాలు

మే 4న ఫలితాలు

ఈ టెక్నాలజీ ద్వారా విజయ్ ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి ఓటర్లతో మాట్లాడుతున్నట్లే అనుభూతి కలుగుతుంది. ఇటీవల కుంభకోణంలో ఈ విధానంతో నిర్వహించిన ప్రచారం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై విజయ్ నిజంగానే ఉన్నట్లుగా కనిపించడంతో భారీగా జనాలు తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజిటల్ యుగంలో ఎన్నికల ప్రచార శైలి ఎలా మారుతోందో ఇది స్పష్టంగా చూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 234 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. ఈ నెల 23న పోలింగ్ నిర్వహించనుండగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు. అన్ని పార్టీలు ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నాయి.

Advertisement