Loading...
AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులను బరిలోకి దించింది. రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎంఐఎం తరఫున కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి, హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవికి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వీటితో పాటు విజయవాడ కార్పొరేషన్‌లో మూడు డివిజన్లు, హిందూపురం మున్సిపాలిటీలో ఐదు వార్డులు,ఆదోనిలో ఏడు వార్డులు, రాయదుర్గంలో మూడు వార్డుల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

వివరాలు 

అసదుద్దీన్ ఓవైసీని కలిసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంఐఎం నాయకులు

నంద్యాల, పెనుగొండ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులోనూ తమ అభ్యర్థులను నిలిపింది. ఇలా మొత్తం 21 స్థానాల్లో పోటీకి దిగింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంఐఎం నాయకులు హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని కలిశారు.

ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే, పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఓవైసీ సూచించినట్లు తెలిసింది.

వివరాలు 

ప్రతిష్ఠాత్మకంగా ఏపీ మున్సిపల్ ఎన్నికలు 

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మిరాజ్, మహమ్మద్ ముబీన్, మాజిద్ హుస్సేన్‌తో పాటు ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

రాష్ట్రంలో పార్టీకి ప్రజాదరణ పెంచడంతో పాటు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం సాధించడంపై ఎంఐఎం నాయకత్వం దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ADVERTISEMENT