
Hyderabad: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది.
ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ 63 ఓట్లు పొందుతూ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే పోటీలో నిలిచాయి. ఈ స్థానానికి 22 సంవత్సరాల విరామం తర్వాత ఎన్నిక జరగడం విశేషం.
బీజేపీ ఊహించని రీతిలో అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు
ఎక్స్ అఫీషియో ఓట్లలో ఎంఐఎం,భారాసలకు 9 ఓట్లు
ఎన్నిక ఏప్రిల్ 23న నిర్వహించబడింది. మొత్తం 112 ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు ఎంఐఎంకు ఉన్నాయి.
ఆ పార్టీకి 49 ఓట్లు ఉన్నప్పటికీ, ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధించింది.
ఇక్కడ ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు కాగా, మిగిలిన 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు.
వీరిలో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.
ఎక్స్ అఫీషియో ఓట్లలో ఎంఐఎం, భారత రాష్ట్ర సమితి (భారాస)లకు 9 ఓట్లు చొప్పున ఉండగా.. కాంగ్రెస్‌కు 7, బీజేపీకి 6 ఓట్లు ఉన్నట్లు సమాచారం.