LOADING...
Air Force: పాక్‌కు రహస్యాలు లీక్‌.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్
పాక్‌కు రహస్యాలు లీక్‌.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్

Air Force: పాక్‌కు రహస్యాలు లీక్‌.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వాయుసేనలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో నిందితుడికి పాక్ హ్యాండ్లర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మరో కేసు విచారణలో భాగంగా ఈ గూఢచర్యం వ్యవహారం బయటపడటం గమనార్హం.

వివరాలు 

విచారణలో బయటపడిన కీలక లింకులు

ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన జబరా రామ్‌ను పోలీసులు ఒక కేసులో అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు ఉన్న సుమిత్ కుమార్ గురించి సమాచారం లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 36 ఏళ్ల సుమిత్ కుమార్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లా చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ టాస్కింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. తన ఉద్యోగాన్ని దుర్వినియోగం చేస్తూ వాయుసేనకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. సుమిత్ కుమార్ డబ్బు కోసం ఈ గూఢచర్యానికి పాల్పడ్డాడని దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా వేదికగా పాక్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు కొనసాగిస్తూ కీలక సమాచారం పంచుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

జాయింట్ ఆపరేషన్‌లో అరెస్ట్

నిందితుడిని పట్టుకునేందుకు రాజస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. అరెస్ట్ అనంతరం సుమిత్‌ను జైపూర్‌కు తరలించి మరింత విచారణ చేపట్టారు. కీలక రహస్యాలు లీక్‌ 2023 నుంచే సుమిత్‌కు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి నుంచి డబ్బు స్వీకరించి, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, వాటి నిల్వ స్థలాలు, అలాగే ఎయిర్‌ఫోర్స్ అధికారుల వివరాలు వంటి కీలక సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్లకు అందించినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement