Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి సాధారణ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అక్టోబర్ 24వరకు అమల్లో ఉండే విమానాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్-భోగాపురం మార్గంలో రోజుకు ఐదు విమాన సర్వీసులు నడవనున్నాయి. బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులు అందుబాటులో ఉండగా, ఆదివారం మరియు శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసును కూడా నిర్వహించనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అలాగే విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు నాలుగు విమానసర్వీసులు నడపనున్నట్లు సంస్థ తెలిపింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రకు విమాన రాకపోకలు మరింత విస్తరించి, ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అక్టోబర్ 24 వరకు విమానాల షెడ్యూల్ సిద్ధం
విశాఖ:
— Vizag News Man (@VizagNewsman) July 31, 2026
అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్లైట్ షెడ్యూల్ విడుదల చేసిన ఎయిరిండియా
ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు ఫ్లైట్ షెడ్యూల్ ప్రకటించిన ఎయిరిండియా
హైదరాబాద్-భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులు నడపనున్న ఎయిరిండియా
బెంగళూరు-భోగాపురం మధ్య రోజూ 2 సర్వీసులు… pic.twitter.com/MARRjF2z8O