Loading...
Hijack threat: కోల్‌కతా-ముంబై ఎయిరిండియా విమానానికి హైజాక్‌ హెచ్చరిక
కోల్‌కతా-ముంబై ఎయిరిండియా విమానానికి హైజాక్‌ హెచ్చరిక

Hijack threat: కోల్‌కతా-ముంబై ఎయిరిండియా విమానానికి హైజాక్‌ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి బుధవారం ఉదయం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు రావడం కలకలం రేపింది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో దాని వాష్‌రూమ్‌లో హైజాక్ హెచ్చరికతో కూడిన సందేశం కనిపించింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో విమానాన్ని ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ బేకు తరలించారు. విమానంలో ఉన్న 93 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందిని కిందకు దించారు.

వివరాలు 

తనిఖీలు చేపట్టిన భద్రతా సంస్థలు

ఎయిర్‌పోర్టు వర్గాలను ఉటంకిస్తూ CNN-News18 వెల్లడించిన వివరాల ప్రకారం.. AI 772 నంబర్‌తో నడిచే ఈ విమానం ఎయిర్‌బస్ A320neo రకం.

బుధవారం ఉదయం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానం వాష్‌రూమ్‌లో హైజాక్ చేస్తామంటూ రాసిన సందేశాన్ని గుర్తించినట్లు సమాచారం.

దీంతో భద్రతా సంస్థలు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.

అయితే ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ADVERTISEMENT