Loading...
Air India: ఫ్రాంక్‌ఫర్ట్‌-ఢిల్లీ విమానానికి హైజాక్ బెదిరింపు.. జైపూర్‌లో ల్యాండింగ్
ఫ్రాంక్‌ఫర్ట్‌-ఢిల్లీ విమానానికి హైజాక్ బెదిరింపు.. జైపూర్‌లో ల్యాండింగ్

Air India: ఫ్రాంక్‌ఫర్ట్‌-ఢిల్లీ విమానానికి హైజాక్ బెదిరింపు.. జైపూర్‌లో ల్యాండింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్‌ ముప్పు ఉందన్న సమాచారంతో జైపూర్‌కు మళ్లించారు. విమాన భద్రతకు సంబంధించిన హెచ్చరిక రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. AI 2030 విమానం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. తొలుత విమానంలో బాంబు ఉందంటూ సమాచారం వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, అది బాంబు బెదిరింపు కాదని, విమానాన్ని హైజాక్‌ చేస్తారన్న వదంతి మాత్రమేనని విమానాశ్రయానికి చెందిన ఓ అధికారి హిందుస్థాన్ టైమ్స్‌కు తెలిపారు. తన పేరు వెల్లడించవద్దని కోరారు.

వివరాలు 

ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటకు

భారత గగనతలంలోకి ప్రవేశించే సమయంలో విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.

ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), భద్రతా సంస్థలకు తెలియజేశారు.

విమానం ల్యాండ్ అయిన తర్వాత దాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు.

అక్కడ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది, స్థానిక పోలీసులు, బాంబు గుర్తింపు, నిర్వీర్య బృందం విమానాన్ని, ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశాయి.

అనంతరం ప్రయాణికులు, విమాన సిబ్బందిని విమానాశ్రయ టెర్మినల్‌లోని ప్రత్యేక ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.

వివరాలు 

అధికారిక ప్రకటన విడుదల చేయని ఎయిర్ ఇండియా

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా లేదా విమానాశ్రయ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

భద్రతా హెచ్చరికకు అసలు కారణం ఏమిటి? సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందని విమానాశ్రయ అధికారి తెలిపారు.

ప్రస్తుతం ఈ హెచ్చరికకు సంబంధించిన అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ADVERTISEMENT