LOADING...
Hyderabad Air Pollution: హైదరాబాద్‌లో దిగజారిన గాలి నాణ్యత.. భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత
హైదరాబాద్‌లో దిగజారిన గాలి నాణ్యత.. భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత

Hyderabad Air Pollution: హైదరాబాద్‌లో దిగజారిన గాలి నాణ్యత.. భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో దీపావళి సంబరాలతో గాలి నాణ్యత అత్యంత చెత్తస్థాయికి చేరింది. పండుగ రోజుల్లో టపాసులు విరాళంగా కాల్చడం కారణంగా నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో తీవ్ర కాలుష్యం ఏర్పడింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, అత్యధికంగా సనత్ నగర్‌లో PM10 స్థాయి 153 µg/m³గా, న్యూ మలక్ పేట 164 µg/m³, కాప్రా 140 µg/m³, కోకాపేట 134 µg/m³, సోమాజిగూడ 122 µg/m³, రామచంద్రాపురం 122 µg/m³, కొంపల్లి 120 µg/m³గా నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది.

Details

గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే వాడాలి

దీపావళి పండుగ వేళ కాలుష్యం తీవ్రతకు చేరడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)మంగళవారం ఉదయం 8 గంటలకు 350కు చేరింది,ఇది ప్రమాదకర స్థాయిగా గుర్తించారు. వాతావరణవేత్తలు, పర్యావరణ నిపుణులు దీని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది, అలాగే కాల్చే సమయాన్ని కూడా నిర్దేశించింది. అయితే ఈ ఆదేశాలను విస్మరించి పెద్ద ఎత్తున మందుగుండు, రాకెట్లు, బాణాసంచాలు కాల్చడం జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మబ్బుగా ఉన్న వాతావరణం, తీవ్రమైన కాలుష్యం వల్ల గాలి నాణ్యత పూర్తిగా తగ్గింది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత చర్యలు తీసుకోవడం, పండుగ వేళ కూడా గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే వాడడం అత్యవసరంగా మారింది.