Page Loader
ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత
ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలో క్షిణిస్తున్న గాలి నాణ్యత

ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత

వ్రాసిన వారు Stalin
Apr 11, 2023
06:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సోమవారం 'మోడరేట్' కేటగిరీలో 195గా ఉందని, ఇది ఆదివారం కనిష్ఠంగా 217 ఏక్యూఐ కేటగిరీని తాకినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా చెప్పింది. దిల్లీలో మంగళవారం, బుధవారాల్లో గాలి నాణ్యత 'పేలవమైన' కేటగిరీలో ఉండే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పేర్కొంది. అలాగే గాలి నాణ్యత గురువారం 'మోడరేట్' కేటగిరీకి చేరుకొని కాస్త మెరుగుపడవచ్చని వెల్లడించింది.

దిల్లీ

కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు వేసవి కార్యాచరణ ప్రణాళిక: దిల్లీ ప్రభుత్వం

దిల్లీలో ధూళి సాంద్రత ఎక్కువగా ఉందని, రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పర్యావరణం, పరిశోధనా కేంద్రం హెడ్ వీకే సోనీ చెప్పారు. నగరంలో బలమైన గాలులు వీస్తుండటంతో స్థానికంగా దుమ్ము లేస్తోందని, అంతేకాకుండా గాలి దిశ వాయువ్యంగా ఉన్నందున, వాయువ్య భారతదేశం నుంచి పొడి గాలులు దిల్లీకి దుమ్మును మోసుకొస్తున్నాయని వివరించారు. మరోవైపు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అధిక కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.