
YS Viveka Case : సీబీఐ తప్పుగా వాంగ్మూలాన్ని రికార్డు చేసిందంటూ అజేయ కల్లం పిటిషన్
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. విచారణలో భాగంగా తన వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసిందంటూ అజేయ కల్లం నేడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
వివేకా హత్య కేసులో సీబీఐ పేర్కొన్న స్టేట్ మెంట్‌లో అన్ని అబద్దాలే ఉన్నాయని అజేయం కల్లం పేర్కొన్నారు.
ఏప్రిల్ 29, 2023న సీబీఐ తన నుంచి ఓ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిందని, అయితే ఆ స్టేట్ మెంట్ మొత్తం మార్చి చార్జిషీటులో పేర్కొన్నారని అజేయకల్లం తన పిటిషన్‌లో వివరించారు.
దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆయన హైకోర్టును అశ్రయించారు.
Details
దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు: అజేయ కల్లం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టుకు జూన్ 30వ తేదీని ఛార్జ్ షీట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే.
తాను వైఎస్ భారతీ ప్రస్తావన కానీ, మరే ఇతర ప్రస్తావన కానీ సీబీఐ విచారణకు తీసుకురాలేదని, ఇందులో దర్యాప్తును తప్పుదోవ పట్టించే ధోరణి కనిపిస్తోందని అజేయ్ కల్లం చెప్పారు.
సీబీఐ ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి తాను ఎవరి వద్దా ప్రస్తావించలేదని, అయితే ఓ పత్రికలో కథనం వచ్చిందని, ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆ పిటిషన్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ డైరక్టర్‌తో పాటు విచారణ అధికారిని ఆయన ప్రతివాదులుగా చేర్చారు. ఇక దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.