
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన
ఈ వార్తాకథనం ఏంటి
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అయోధ్య రామమందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.
ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అధికారికంగా తెలిపారు.
వైశాఖ శుక్ల పక్ష విదియ, మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడిందని వెల్లడించారు.
ఈ పుణ్యకార్యానికి సంబంధించిన చిత్రాలను ఇంటర్నెట్ వేదికగా పంచగా, నెటిజనుల నుంచి విశేష స్పందన వచ్చింది.
Details
త్వరలోనే ఏడు మండపాల నిర్మాణం పూర్తి
ఇక రామమందిర నిర్మాణంలో వేగం పెంచిన ట్రస్టు, త్వరలోనే ఏడు మండపాల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది.
అలాగే రామ్‌దర్భార్‌లో శ్రీరాముడితో పాటు సీత, లక్ష్మణ, హనుమాన్, భరత, శతృఘ్నుల విగ్రహాలు మే నెలలోనే రానున్నట్లు సమాచారం.
ఆలయ ఈశాన్య దిశలో శివాలయం, నైరుతి దిశలో సూర్యదేవాలయ నిర్మాణం కూడా కొనసాగుతోందని ట్రస్టు వెల్లడించింది.
మొత్తం నిర్మాణ పనులను ఈ ఏడాది అక్టోబర్ లోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది.