LOADING...
Al Falah University: ఫోర్జ‌రీ కేసులో అల్ ఫ‌లాహ యూనివ‌ర్సిటీ చైర్మెన్ అరెస్టు
ఫోర్జ‌రీ కేసులో అల్ ఫ‌లాహ యూనివ‌ర్సిటీ చైర్మెన్ అరెస్టు

Al Falah University: ఫోర్జ‌రీ కేసులో అల్ ఫ‌లాహ యూనివ‌ర్సిటీ చైర్మెన్ అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆయనపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్ల ఘటన అనంతరం యూజీసీ ఈ ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ముఖ్యంగా ఫోర్జరీ కోణంలో విచారణ కొనసాగుతోంది.

వివరాలు 

ఫోర్జరీకి పాల్పడిన చైర్మెన్

అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పలు అక్రమాలు జరిగాయని, వాటికి సంబంధించి యూనివర్సిటీ చైర్మెన్ ఫోర్జరీకి పాల్పడ్డారని క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన సిద్ధికీని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్ ఫ‌లాహ యూనివ‌ర్సిటీ చైర్మెన్ అరెస్టు

Advertisement