AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెలలోనే రిజల్ట్స్ రిలీజ్ అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మూల్యాంకన ప్రక్రియను విడతల వారీగా నిర్వహిస్తూ, ఏప్రిల్ 9వ తేదీ నాటికి పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాల్యూయేషన్‌లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ వంటి పలు దశల ద్వారా పేపర్లను పరిశీలిస్తున్నారు. స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 9తో ముగిసిన అనంతరం ఫలితాల ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి సుమారు ఐదు నుంచి ఆరు రోజులు పట్టే అవకాశం ఉంది.
వివరాలు
మన మిత్ర ద్వారా ఫలితాలు
ఈ క్రమంలో, ఈసారి ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 15 తర్వాత ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ [https://resultsbie.ap.gov.in/](https://resultsbie.ap.gov.in/) ద్వారా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మనమిత్ర' సేవ ద్వారా 95523 00009 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపాలి. వచ్చిన రిప్లైలో 'Select Service' ఆప్షన్ ఎంచుకుని, తరువాత 'Education Services' క్లిక్ చేయాలి. అది యాక్టివ్ అయిన తర్వాత హాల్‌టికెట్ నంబర్ నమోదు చేస్తే, ఫలితాలు/మార్కుల మెమో పీడీఎఫ్ రూపంలో వాట్సాప్‌కు అందుతాయి.