TS inter results 2026 : ఇంటర్ స్టూడెంట్స్‌కు అలర్ట్.. రేపే ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శనివారం ఫలితాలను విడుదల చేసే అవకాశముంది. ఏదైనా కారణంతో ఆ రోజు విడుదల కాకపోతే... ఆదివారం లేదా సోమవారం ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధంగా ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఫలితాల తేదీపై రోజుకో వార్త వస్తుండగా, కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై స్పష్టత రావడంతో గందరగోళానికి తెరపడింది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18తో ముగిశాయి.
వివరాలు
గత నెలాఖరులో మూల్యాంఖన పూర్తి
సమాధాన పత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది. అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఒకే సబ్జెక్టులో ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో ఫెయిలైన విద్యార్థుల సమాధాన పత్రాలను ఈసారి మళ్లీ మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తి అయింది. విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని ఈ నెల 11న ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. సీఎం అనుమతి వచ్చిన వెంటనే విడుదల తేదీపై తుది స్పష్టత రానుంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది హాజరయ్యారు. ఇందులో 4,89,126 మంది ప్రథమ సంవత్సరం, 5,07,949 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.
వివరాలు
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
TSBIE అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి "Inter Results 2026" లింక్‌పై క్లిక్ చేయండి మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి Submit పై క్లిక్ చేయండి ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఫలితాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.