Indian Railways Ticket Cancellation rules: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్ అమల్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది. ట్రైన్ బయల్దేరే సమయాన్ని ఆధారంగా తీసుకుని రిఫండ్ ఇవ్వడం విషయంలో కొత్త నియమాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సంస్కరణలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా ఈ మార్పులు అమలు చేయనున్నట్లు తెలిపారు.
వివరాలు
కొత్త నియమాలు ఇలా..
ప్రయాణానికి 72 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే, క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని పూర్తిగా రిఫండ్ చేస్తారు. 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే, టికెట్ ధరలో 25% పెనాల్టీ విధించి మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ట్రైన్ బయల్దేరడానికి 24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే, 50% ఫేర్ కట్ చేసి మిగతా మొత్తాన్ని ఇస్తారు. ప్రయాణానికి 8 గంటల ముందు లేదా ట్రైన్ బయల్దేరిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు.
వివరాలు
బోర్డింగ్ పాయింట్, ఇతర సదుపాయాలు
ఇప్పుడు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం కల్పించారు. నగరాల్లో పలు స్టేషన్లు ఉన్న ప్రయాణికులకు ఇది ఉపయోగపడుతుంది. కౌంటర్ టికెట్‌ను ఇకపై ఏ స్టేషన్‌లోనైనా రద్దు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఇ-టికెట్ కలిగిన ప్రయాణికులకు TDR ఫైల్ చేయడాన్ని ఆటోమేటిక్ చేశారు. ఇకపై మాన్యువల్ ప్రక్రియ అవసరం లేదు. కౌంటర్ టికెట్ ఉన్నవారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు తమ ట్రావెల్ క్లాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది.
వివరాలు
ప్రస్తుత క్యాన్సిలేషన్ ఛార్జీలు
ట్రైన్ బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే: ఏసీ ఎగ్జిక్యూటివ్/ఫస్ట్ క్లాస్: రూ.240 + జీఎస్టీ ఏసీ చెయిర్ కార్: రూ.180 + జీఎస్టీ స్లీపర్ క్లాస్: రూ.120 * సెకండ్ క్లాస్: రూ.60 48 నుంచి 12 గంటల మధ్య రద్దు చేస్తే 25% ఫేర్ కట్ 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 50% ఫేర్ కట్ 4 గంటల లోపు రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ లేదు మొత్తంగా ఈ మార్పులతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడంతో పాటు, పారదర్శకమైన రిఫండ్ వ్యవస్థను అమలు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.