
AP SSC Results 2025: విద్యార్థులకు అలెర్ట్.. నేడు పదో తరగతి ఫలితాల విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ముఖ్య సూచన. ఈరోజే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఇవి కాకుండా, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ఫలితాలు కూడా ఈ సందర్భంగా విడుదల కానున్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
విద్యార్థులు తమ ఫలితాలను [https://bse.ap.gov.in](https://bse.ap.gov.in), [https://apopenschool.ap.gov.in](https://apopenschool.ap.gov.in) వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
Details
6లక్షల మంది విద్యార్థుల హాజరు
అంతేకాదు, మన మిత్ర వాట్సాప్ యాప్, లీప్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను చూసుకోవచ్చు.
మన మిత్ర వాట్సాప్‌లో ఫలితాలు తెలుసుకోవాలంటే, 9552300009 నంబరుకు 'హాయ్' అని మెసేజ్ పంపించి, అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి.
అనంతరం 'SSC Public Exam Results' అనే ఎంపికను సెలెక్ట్ చేసి, రోల్ నంబర్ ఎంటర్ చేయాలి.
వెంటనే ఫలితాలు PDF రూపంలో పొందవచ్చు. ఇక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ఉపయోగించి విద్యార్థుల ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.