Srisailam: తిరుపతి తొక్కిసలాటతో అప్రమత్తం.. శ్రీశైలంలో శివరాత్రి ఏర్పాట్లపై నేడు ఆరుగురు మంత్రుల పరిశీలన
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
తిరుపతి ముక్కోటి ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ నేపథ్యంలో శ్రీశైలంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇందుకోసం మంత్రులను ప్రత్యక్షంగా రంగంలోకి దింపింది. ఈ ఏడాది మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
గతంలో కేవలం ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు.
Details
ఇవాళ అధికారులతో మంత్రుల సమీక్షా
అయితే ఈసారి సీఎం చంద్రబాబు స్వయంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
శ్రీశైలం మహా శివరాత్రి వేడుకలకు ప్రతేడాది లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.
శివమాల ధరించిన భక్తులు లక్షల్లో చేరుకోగా, నల్లమల అడవీ మార్గం ద్వారా వేలాది మంది కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం.
ఈసారి ఐదుగురు మంత్రులైన పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం వెళ్లి ఏర్పాట్లను సమీక్షించనున్నారు.
ఈరోజు వారు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Details
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
ఈ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఫిబ్రవరి 23న సీఎం చంద్రబాబు స్వయంగా భ్రమరాంభ, మల్లికార్జునస్వాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించలేదు.
కేవలం జిల్లా మంత్రి మాత్రమే ఈ సంప్రదాయాన్ని నిర్వహించేవారు.
సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆర్థం చేసుకోవచ్చు.