#NewsBytesExplainer: నేతల పర్యటనలు ఒకలా.. జగన్‌ది మరోలా.. కారణం ఏమిటీ?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఏదైనా ఉత్పాతం జరిగితే.. రాజకీయ నాయకులందరూ బాధితులను పరామర్శిస్తూనే ఉంటారు. విపత్తు సంభవిస్తే బాధితుల్ని అటు ప్రభుత్వం, ఇటు విపక్ష నేతలు పరామర్శిస్తారు. కానీ ఎవరూ చేయనంత హడావుడి... చేయనంత అతి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేస్తారు. ఆయన చేసే అతి ప్రదర్శనల కారణంగా ప్రజలు తిప్పలు పడడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అవి ప్రాణపాయాన్ని కూడా కలిగించడమే కాకుండా ఆ బాధితులు మరింత బాధితులు అవుతారు. అయినా సరే ఆయన డోంట్ కేర్. జగన్ రెడ్డికి ఉన్న అనేక మానసిక సమస్యల్లో ఇది కూడా ఒకటి అనేది వైసీపీ నేతలు చెప్పే మాట.
వివరాలు
తన కోసం జనం తొక్కేసుకుంటున్నారని అనుకునేలా జగన్ డ్రామాలు
జగన్మోహన్ రెడ్డి బయటకి వచ్చినప్పుడు జనం తన కోసం వెల్లువలా వస్తారని చూపించుకోవాలని ఆశ ఉంటుంది. ఆ కారణంగా, జనతా పెద్ద ఎత్తున హాజరయ్యేలా చేసుకోవాలని ఆయన ఆశపడతారు. ప్రజలు రాకపోతే, తనను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని..తానో అనామక లీడర్‌గా మిగిలిపోతానని ఆయన భయం. అందుకే బయటకు రావాలంటే పక్కా స్క్రిప్ట్ ప్రకారమే వస్తారు. తుపాను వచ్చిన వారం తర్వాత బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లడం; ఏడాది తర్వాత ఎవరో ఆత్మహత్య చేసుకున్నబాధితుని విగ్రహావిష్కరణలో పాల్గొనడం; లేదా అందరూ మర్చిపోయాక తెనాలి రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్లడానికి అదే కారణం. కాస్త టైం తీసుకుని జన సమీకరణకు అందరికీ టార్గెట్లు పెట్టి అప్పుడు బయలుదేరుతారు.
వివరాలు
దేశంలో మరే నేతకూ ఉండని మానసిక దౌర్బల్యం
దేశంలో ఎవరికీ లేనటువంటి మానసిక రుగ్మత జగన్‌కు ఉంది. చివరికి పెళ్లిళ్ల వంటి సామాజిక వేడుకల సందర్బాల్లో కూడా ఆయన జన సమీకరణ చేస్తారంటే ఆయన మానసిక స్థాయి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను అధికారంలో లేకపోవడంతో ప్రజలు కష్టపడతారని ఆయన భావిస్తారు.ఆ భావనతో బయటకు వచ్చినప్పుడు స్క్రిప్టెడ్ స్కిట్స్ నుప్రవేశ పెడతారు. అవి నిజంగా డ్రామాలన్న విషయాన్ని ఆయనకి కూడా బాగా తెలుసుకోవచ్చు, అయినప్పటికీ ఆ డ్రామానే రాజకీయంగా పనికివస్తుందనే నమ్మకం ఆయనలో తీవ్రంగా ఉంది. తన కోసం మోకాళ్ల దండాల ఆర్టిస్టుల సహా అన్ని వర్గాలూ బయలుదేరి వస్తారు.
వివరాలు
పరామర్శల పేరుతో ప్రజలకు.. బాధితులకూ నరకం చూపించే జగన్ !
బాధితులను పరామర్శించడానికి ఆయన రూపొందించే స్క్రిప్టులు వల్ల సాధారణ ప్రజలకి మాత్రమే కాకుండా, నిజంగా సహాయం కోరుకునేవారికి కూడా కొత్త సమస్యలు ఎదురవుతాయి. అయన వెనక వచ్చిన మూక మొత్తం పంటను తొక్కేస్తుంది. అంతేకాదు బాగున్న పంటను కూడా తొక్కేయడంతో జగన్ పరామర్శ రైతులకూ ఇబ్బందికరంగా మారుతోంది. జగన్ అతి ప్రవర్తన, కారణంగా దేశంలో ఏ నేత కూడా చేయని విధంగా రాజకీయాలు చేస్తూంటారు. తాను వస్తే జనం తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారని అనిపించుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. కానీ ఆయన వస్తే .. జన సమీకరణ చేయకుండా కూడా రారనేది అసలు నిజం.