NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్
    తదుపరి వార్తా కథనం
    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్
    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్

    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్

    వ్రాసిన వారు Stalin
    May 02, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నిరంతరం వైద్య సదుపాయాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

    క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

    గ్రామ దవాఖానాల నుంచి వైద్య కళాశాల ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించి త్వరగా పదవీ విరమణ పొందుతున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది సంఖ్యను జాబితా చేయాలని, అటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

    ఆంధ్రప్రదేశ్

    'ఫ్యామిలీ డాక్టర్' కాన్సెప్ట్‌‌ను పకడ్బందీగా అమలు చేయాలి: జగన్

    'ఫ్యామిలీ డాక్టర్' కాన్సెప్ట్‌‌ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నోటిఫై చేసిన గ్రామాల్లో వైద్యుల వచ్చే సమాచారాన్ని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం ద్వారా ముందుగానే స్థానిక ప్రజలకు తెలియజేయాలని జగన్ పేర్కొన్నారు.

    కంటి వెలుగులో భాగంగా కంటిచూపు సమస్యలున్న వారికి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం చెప్పారు.

    రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణపై గ్రామ దవాఖానల ద్వారా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గర్భిణులకు కూడా పౌష్టికాహారం అందించాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను కోరారు.

    కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు శిక్షణ నిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ
    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కోవిడ్
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం అనంతపురం అర్బన్
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా వార్తలు

    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు బెంగళూరు
    అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025