Loading...
Allahabad High Court: 'మేజర్ అయిన కుమార్తెపై తల్లిదండ్రుల నిర్బంధం చెల్లదు': అలహాబాద్ హైకోర్టు
'మేజర్ అయిన కుమార్తెపై తల్లిదండ్రుల నిర్బంధం చెల్లదు': అలహాబాద్ హైకోర్టు

Allahabad High Court: 'మేజర్ అయిన కుమార్తెపై తల్లిదండ్రుల నిర్బంధం చెల్లదు': అలహాబాద్ హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేజర్ అయిన కుమార్తెను తమతోనే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వయోజనురాలైన మహిళ తన ఇష్టానుసారం జీవించాలనుకుంటే.. ఆమెను ఇంట్లో ఉండాలని ఒత్తిడి చేయడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ విషయంలో తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా ఉపయోగించలేరని తెలిపింది. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సందీప్ జైన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం సెప్టెంబర్ 28న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తల్లిదండ్రులు తమ కుమార్తెపై ప్రేమ, బాధ్యత కలిగి ఉన్నప్పటికీ.. ఆమె మేజర్ అయిన తర్వాత స్వచ్ఛందంగా వ్యక్తం చేసిన నిర్ణయాన్ని నిరాకరించి, మరొకరితో కలిసి ఉండకుండా అడ్డుకోలేరని న్యాయస్థానం పేర్కొంది.

వివరాలు 

అసలేం జరిగిందంటే..?

కళావతి దేవి అనే మహిళ తన 25 ఏళ్ల కుమార్తె పూజను కోర్టు ఎదుట హాజరుపరచాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇందుకోసం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. 2026 ఆగస్టు 17న పూజను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పూజను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆమెతో నేరుగా మాట్లాడి పరిస్థితిని, ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

తాను ఢిల్లీలో ఎవరి నిర్బంధంలోనూ లేనని పూజ స్పష్టం చేసింది. తన స్వంత నిర్ణయంతోనే అక్కడ స్వతంత్రంగా జీవిస్తున్నానని కోర్టుకు తెలిపింది.

వివరాలు 

తల్లి వద్దకు వెళ్లేందుకు నిరాకరణ

తన తల్లి వద్దకు వెళ్లి తిరిగి నివసించడానికి తనకు ఏమాత్రం ఆసక్తి లేదని పూజ స్పష్టం చేసింది.

పుట్టింట్లో ఉన్న సమయంలో తల్లి తనతో సరిగా వ్యవహరించలేదని ఆమె ఆరోపించింది. తరచూ తనపై భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు దూషించేవారని కోర్టుకు తెలిపింది.

అయితే పూజ చేసిన ఈ ఆరోపణలను ఆమె తల్లి కళావతి దేవి ఖండించారు. తన కుమార్తెను తిరిగి ఇంటికి పంపించాలని ఆమె కోర్టును కోరారు.

ADVERTISEMENT

వివరాలు 

మేజర్ కావడంతో సొంత నిర్ణయం తీసుకునే హక్కు

ఇరుపక్షాల వాదనలు,పూజ వాంగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

పూజ వయస్సు 25సంవత్సరాలు కావడంతో ఆమె మేజర్ అని,తన జీవితానికి సంబంధించిన మంచి చెడులను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఆమెకు ఉందని పేర్కొంది.

తల్లి వద్ద ఉండేందుకు ఇష్టపడటం లేదని,స్వచ్ఛందంగా వేరుగా జీవించాలనుకుంటున్నానని పూజ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో..ఆమెను ఎవరూ అక్రమంగా నిర్బంధించినట్లు ఆధారాలు లేవని కోర్టు తేల్చింది.

మేజర్ అయిన వ్యక్తికి తనకు నచ్చిన ప్రదేశంలో,తనకు నచ్చిన వ్యక్తితో జీవించే స్వేచ్ఛ ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

ఆమెను తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లాలని బలవంతం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

దీంతో కళావతిదేవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.

ADVERTISEMENT