Amaravati: అమరావతిలో 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్‌వీల్.. నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్‌వీల్ నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు అనుగుణంగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) మరోసారి టెండర్లు ఆహ్వానించింది. లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న 'లండన్ ఐ' తరహాలో కృష్ణా నది తీరంలో నిర్మించనున్న ఈ భారీ ఫెర్రిస్‌వీల్‌కు 'అమరావతి ఐ'గా పేరు నిర్ణయించారు. లండన్ ఐ 120 మీటర్ల ఎత్తు ఉండగా, దానిని మించి 139 మీటర్ల ఎత్తులో అమరావతి ఐ నిర్మించాలని తొలుత ప్రతిపాదించారు. ఫెర్రిస్‌వీల్ నిర్మాణానికి ఐదు ఎకరాలు, దానికి అనుబంధంగా వాణిజ్య కార్యకలాపాల కోసం మరో ఎకరం కేటాయిస్తూ ఏజీఐసీఎల్ గతంలో టెండర్లు పిలిచింది.
వివరాలు
మూడు క్యాటగిరీలుగా ప్రాజెక్టు!
అయితే ఈ టెండర్లకు ఆశించిన స్పందన లభించలేదు. అమరావతి ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న నగరం కావడంతో.. ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలంటే వాణిజ్య కార్యకలాపాలకు ఒక ఎకరం మాత్రమే కేటాయించడం సరిపోదని పలువురు సంస్థలు ప్రీ-బిడ్ సమావేశంలో అభిప్రాయపడ్డాయి.
దీంతో ఆ సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఏజీఐసీఎల్ నిబంధనల్లో మార్పులు చేసి తాజాగా మరోసారి టెండర్లు పిలిచింది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్‌వీల్‌గా దుబాయిలోని'ఎయిన్ దుబాయి' గుర్తింపు పొందింది.
ఇది 250 మీటర్ల ఎత్తుతో ఉండగా.. ఇందులో 48కాప్స్యూల్స్ ఉన్నాయి. ఒకేసారి 1,750మంది ప్రయాణికులు వీటిలో ప్రయాణించగలరు.
అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఉన్న 'హై రోలర్' 167.6 మీటర్ల ఎత్తుతో,సింగపూర్‌లోని 'సింగపూర్ ఫ్లయర్' 165 మీటర్ల ఎత్తుతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వివరాలు
మూడు క్యాటగిరీలుగా ప్రాజెక్టు!
అమరావతి ఐని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్‌వీల్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు సూచన నేపథ్యంలో.. ప్రాజెక్టును మూడు క్యాటగిరీలుగా విభజించి టెండర్లు పిలిచారు.
250 మీటర్లకు పైగా ఎత్తైన ఫెర్రిస్‌వీల్ నిర్మాణానికి సంస్థలు ముందుకొస్తే ఆ ప్రతిపాదనను స్వీకరించేలా నిబంధనలు రూపొందించారు.
ఒకవేళ అంతకంటే ఎక్కువ ఎత్తుకు సంస్థలు ముందుకు రాకపోతే.. తక్కువ ఎత్తులోనైనా ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉండేలా వేర్వేరు కేటగిరీలను ఏర్పాటు చేశారు.
128 నుంచి 175 మీటర్ల ఎత్తు ఉన్న ఫెర్రిస్‌వీల్‌కు గ్రీన్ జోన్‌లో ఐదు ఎకరాలు, వాణిజ్య జోన్‌లో ఒక ఎకరం కేటాయించనున్నారు.
175 నుంచి 200 మీటర్ల ఎత్తు ఉన్న వీల్‌కు గ్రీన్ జోన్‌లో ఐదు ఎకరాలు, వాణిజ్య జోన్‌లో మూడు ఎకరాలు ఇస్తారు.
వివరాలు
కనీస ఎత్తు, వ్యాసంపై స్పష్టత
200 నుంచి 250 మీటర్ల ఎత్తు ఉన్న ఫెర్రిస్‌వీల్‌కు గ్రీన్ జోన్‌లో ఐదు ఎకరాలు, వాణిజ్య జోన్‌లో నాలుగు ఎకరాలు కేటాయిస్తారు.
ఇక 250 మీటర్లకు మించి ఎత్తు ఉన్న ఫెర్రిస్‌వీల్‌కు గ్రీన్ జోన్‌లో ఐదు ఎకరాలు, వాణిజ్య జోన్‌లో ఐదు ఎకరాలు కేటాయించనున్నట్లు టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అమరావతి ఐ ఫెర్రిస్‌వీల్ కనీస ఎత్తు 139 మీటర్లు, వ్యాసం కనీసం 128 మీటర్లు ఉండాలని ఏజీఐసీఎల్ స్పష్టం చేసింది. ఈ ప్రమాణాల కంటే తక్కువ ఎత్తు లేదా వ్యాసంతో ఎవరైనా బిడ్ దాఖలు చేస్తే దానిని తిరస్కరిస్తామని తెలిపింది.
వివరాలు
కనీస ఎత్తు, వ్యాసంపై స్పష్టత
ఫెర్రిస్‌వీల్ వ్యాసాన్ని ఆధారంగా చేసుకుని నిర్మాణానికి అవసరమైన గడువును కూడా నిర్ణయించారు. 128 మీటర్ల వ్యాసం ఉన్న ప్రాజెక్టును 12 నెలల్లో పూర్తి చేయాలి.
128 నుంచి 175 మీటర్ల వ్యాసం ఉన్న ఫెర్రిస్‌వీల్‌కు 15 నెలల గడువు ఇచ్చారు.
175 నుంచి 200 మీటర్ల వ్యాసం ఉన్న ప్రాజెక్టుకు 18 నెలలు, 200 మీటర్లకు మించిన వ్యాసం ఉన్న ఫెర్రిస్‌వీల్‌కు రెండేళ్ల నిర్మాణ గడువును ప్రతిపాదించారు.
ఈ ప్రాజెక్టుకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 27తో ముగియనుంది.
తొలుత 139 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించిన అమరావతి ఐలో 28ఎయిర్ కండిషన్డ్ కాప్స్యూల్స్ ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
ఒక్కో కాప్స్యూల్‌లో 20మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా డిజైన్ చేశారు.