Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంతో చట్టరూపం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అధికారికంగా చట్టబద్ధ గుర్తింపు లభించింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టానికి ఇప్పుడు పూర్తి చట్టరూపం వచ్చింది. ఈ మేరకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో మార్పులు చేస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో చర్చించి,మూజువాణి ఓటుతో ఆమోదించాయి. అనంతరం ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. దీనిపై ద్రౌపది ముర్ము సోమవారం సంతకం చేయడంతో, 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026'గా (నం.7/2026) చట్టరూపం దాల్చింది.
వివరాలు
మార్చి 28న తీర్మానం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం ఆమె తన అధికారాలను వినియోగించి ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. అనంతరం న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మార్చి 28న తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానం ఆధారంగా కేంద్రం చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణలు చేసి, అమరావతికి అధికారిక రాజధాని హోదా కల్పించింది.
వివరాలు
సీఆర్‌డీఏ చట్టంలో నోటిఫై చేసిన రాజధాని ప్రాంతాలన్నీ 'అమరావతి' కిందికి
సీఆర్‌డీఏ చట్టం కింద నోటిఫై చేసిన అన్ని రాజధాని ప్రాంతాలు 'అమరావతి' పరిధిలోనే ఉంటాయని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ అంశంపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(CRDA)చట్టం-2014 కింద గుర్తించిన అన్ని ప్రాంతాలను కలిపి అమరావతిగా పరిగణించనున్నారు. ఇకపై ఈ పరిధిలో మార్పులు చేయాలంటే పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర శాసనసభ చేసే మార్పులకు చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రపతికి చంద్రబాబు కృతజ్ఞతలు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కలను నిజం చేసినందుకు రాష్ట్రపతికి, ఏపీ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
Amaravati Notified as Capital in Central Gazette
— Mission Andhra (@MissionAndhra) April 7, 2026
• Central Government issues gazette officially declaring Amaravati as the capital of Andhra Pradesh
• Brings clarity on the capital status
• Expected to accelerate infrastructure development
• Boost to investments and… pic.twitter.com/zeDBOjMHir