LOADING...
Amaravati: అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ నియామకం 
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ నియామకం

Amaravati: అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ నియామకం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అభివృద్ధి పనులను సమన్వయంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21 మంది సభ్యుల సలహా కమిటీని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్‌ను ఛైర్మన్‌గా నియమించగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను కో-ఛైర్మన్‌గా, ఎస్ఆర్ఎం గ్రూప్ డైరెక్టర్ నారాయణరావును సభ్య కార్యదర్శిగా నియమించారు.

వివరాలు 

గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ తీర్మానాల మేరకు కమిటీ నియామకం 

కమిటీ సభ్యులుగా పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, హైడ్రోజన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆర్కే మల్హోత్రా, అలాగే దేశస్థాయిలో గుర్తింపు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులను ఎంపిక చేశారు. జులై 18, 19 తేదీల్లో అమరావతిలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో తీసుకున్న తీర్మానాల ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, హైడ్రోజన్ ఉత్పత్తి, దాని వాణిజ్యీకరణ, ప్రోత్సాహం, వ్యూహ రూపకల్పనపై మార్గదర్శక సూచనలు ఇవ్వడమే ఈ సలహా కమిటీ ప్రధాన బాధ్యత.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ ఏర్పాటు..