Cyclone Montha: మొంథా తుపాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం: చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రం వైపువేగంగా దూసుకొస్తున్న మొంథా తుపాను నేపథ్యంలో,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు,ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ.3,000చొప్పున ఆర్థిక సాయం అందించాలని,అదనంగా 25కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని సీఎం సూచించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి,అవసరమైన మందులు,వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో అత్యవసర వైద్య సేవల సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనే దిశగా ఈచర్యలు ఒక మోడల్‌గా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
•మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
— Telugu Desam Party (@JaiTDP) October 27, 2025
•అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
•పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.
•పునరావాస కేంద్రాలకు… pic.twitter.com/rcyx2T34Ro