LOADING...
Amaravathi: రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. త్వరలో తుది నిర్ణయం
రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. త్వరలో తుది నిర్ణయం

Amaravathi: రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. త్వరలో తుది నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు, పరిశీలన అనంతరం రాష్ట్రపతి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆమె ఆమోదం తెలిపిన వెంటనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ-2026 బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభల్లో దాదాపు ఐదు గంటల పాటు ఈ బిల్లుపై చర్చలు జరిగాయి.

వివరాలు

ఇవాళే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడే అవకాశం

చివరికి ఎలాంటి సవరణలు చేయకుండా ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. అనంతరం లోక్‌సభ సచివాలయం బిల్లును రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఇవాళే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అమరావతి రాజధాని అంశం కీలక మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది.

Advertisement