Page Loader
Ambati rambabu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై.. 'ఏమైంది బ్రో' అంటూ కామెంట్లు 
Ambati rambabu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై.. 'ఏమైంది బ్రో' అంటూ కామెంట్లు

Ambati rambabu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై.. 'ఏమైంది బ్రో' అంటూ కామెంట్లు 

వ్రాసిన వారు Stalin
Jan 06, 2024
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇటీవల వైసీపీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు.. కొన్ని రోజులకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ట్వీట్‌లో అంబటి రాయుడు చెప్పారు. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తా అన్నారు. పార్టీలో చేరిన కొన్ని రోజులకే బయటకు రావడంపై ఏపీలో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. 'ఏమైంది బ్రో' అంటూ ఒకరు కామెంట్ చేయగా.. 'ఇదే ట్విస్ట్ అయ్యా' మరొకరు ట్వీట్‌కు రిప్లే ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంబటి రాయుడు ట్వీట్