Page Loader
America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి  
America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి  

వ్రాసిన వారు Stalin
Jun 23, 2024
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) అనే తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు. గత 8 నెలలుగా అమెరికాలో ఉంటూ అర్కాన్సాస్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న గోపీకృష్ణపై శనివారం మధ్యాహ్నం కౌంటర్‌లో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. గోపీకృష్ణపై దుండగుడు తుపాకీతో కాల్చడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ గోపీకృష్ణ ఆదివారం మృతి చెందాడు. దాడి అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.దీంతో గోపీకృష్ణ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గోపీకృష్ణకి భార్య,కొడుకు ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికాలోని సూపర్ మార్కెట్ లో కాల్పుల ఘటన.. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి మృతి