Amit Shah: దిల్లీ పేలుడు ఘటన.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనపై అన్ని కోణాల నుంచి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, "సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఎర్రకోటకు సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక కారులో పేలుడు జరిగింది. ప్రారంభ సమాచార ప్రకారం,ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి మీదుగా వెళ్లిన పాదచారులు కొందరు గాయపడ్డారు. అదేవిధంగా కొన్ని వాహనాలు కూడా నష్టపోయాయి" అని వివరించారు. సూచన అందిన వెంటనే దిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు.
వివరాలు
ఘటనపై అమిత్ షా ఆందోళన
అలాగే ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. సమీపంలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించాలని ఆదేశించినట్టు చెప్పారు. దిల్లీ పోలీస్ కమిషనర్ మరియు స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌తో తాను మాట్లాడినట్టు, ప్రస్తుతం వారు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు అమిత్ షా స్పష్టం చేశారు. "ఈ కేసును ప్రతి కోణంలో విచారించి, నిజాలను దేశ ప్రజల ముందు ఉంచుతాం" అని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ ఘటనపై అమిత్ షా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెంటనే దిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ పేలుడు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో కూడా నిరంతరం సమాచారం సేకరిస్తున్నారు.