Amit Shah: జూలై 26న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 22, 2026
02:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లనున్న అమిత్‌షా, ప్రతిమ వైద్య కళాశాల రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నట్లు మంగళవారం విడుదలైన అధికారిక షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
వివరాలు
రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశమయ్యే అవకాశం
శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అమిత్‌షాకు స్వాగతం పలకనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే తెలంగాణ రాజకీయ, పార్టీ వ్యవహారాలపై రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశమయ్యే అవకాశమున్నట్లు సమాచారం.