Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్ సింగ్ హతం
అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో బుధవారం పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్(22) హతమయ్యాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. ఇతను ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కాదు. పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా చలామణి అవుతున్నఇతని పేరు కూడా అమృత్‌పాల్ సింగ్ కావడం గమనార్హం. ఈయన్ను మంగళవారం అరెస్టు చేశారు. రెండు కిలోల హెరాయిన్, ఆయుధాల రికవరీ కోసం బుధవారం అమృత్‌పాల్ సింగ్‌ను జండియాల గురుకు పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అమృత్‌పాల్‌ను హెరాయిన్, ఆయుధాలు దాచి పెట్టిన ప్రాంతానికి తీసుకెళ్లగా.. అతను పిస్టల్‌తో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అనివార్య పరిస్థితుల వల్ల అమృత్‌పాల్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.