Page Loader
J&K: నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు..ఆర్మీ జవాన్ మృతి,మరొకరికి గాయాలు
J&K: నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు..ఆర్మీ జవాన్ మృతి

J&K: నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు..ఆర్మీ జవాన్ మృతి,మరొకరికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 18, 2024
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లోని నౌషేరాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో గురువారం ల్యాండ్‌మైన్ పేలుడు కారణంగా భారత ఆర్మీ జవాను మృతి చెందగా,మరొకరికి గాయాలయ్యాయి. 80వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌లోని 17వ సిక్కు లైట్ బెటాలియన్‌కు చెందిన ఏరియా అఫ్ రెస్పాన్సిబిలిటీ (AOR)ఫార్వర్డ్ డిఫెన్స్ లైన్(FDL)నుండి 300 మీటర్ల దూరంలో ఉదయం 10:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. పేలుడు సంభవించినప్పుడు ఇద్దరు ఆర్మీ సిబ్బంది నియంత్రణ రేఖ వెంబడి సాధారణ నిఘా నిర్వహిస్తున్నారు. పేలుడు తరువాత, ఇద్దరు సైనికులను త్వరగా ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక జవాన్ తీవ్రగాయాలతో మృతి చెందగా,మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు