Page Loader
కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు 
దిల్లీసో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు

కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు 

వ్రాసిన వారు Stalin
May 29, 2023
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ కొత్త పార్లమెంట్ భవనం వద్దకు నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను దిల్లీ పోలుసులు ఆదివారం అరెస్టు చేసిన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ర్యాలీకి నాయకత్వం వహించిన పలువురు రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా పలువురు రెజ్లర్ల్‌పై కేసులు నమోదు చేసినట్లు దిల్లీ పోలుసులు తెలిపారు. కొంతమంది రెజ్లర్లు ఆదివారం రాత్రి జంతర్ మంతర్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అయితే వారికి అనుమతిని పోలీసులు నిరాకరించినట్లు వెల్లడించారు.

దిల్లీ

దేశం నియంతృత్వంలోకి జారిపోయిందా?: వినేష్ ఫోగట్ 

రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌‌పై వినేష్ ఫోగట్ స్పందించారు. లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి దిల్లీ పోలీసులు ఏడు రోజులు పడుతుందని, శాంతియుతంగా నిరసన చేపట్టినందుకు తమపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఏడు గంటలు కూడా పట్టలేదన్నారు. దేశం నియంతృత్వంలోకి జారిపోయిందా? ప్రభుత్వం తమ ఆటగాళ్ల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోందని వినేష్ ఫోగట్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో మండిపడ్డారు. పోలీసులు తనను కస్టడీకి తీసుకోవడంపై రెజ్లర్ భజరంగ్ పునియా కూడా స్పందించారు. పోలీసులు తమను కస్టడీలో ఉంచారని, కానీ ఏమీ చెప్పడం లేదన్నారు. బ్రిజ్ భూషణ్ జైల్లో ఉండాల్సింది బోయి, తమను జైల్లో ఎందుుకు పెట్టారని పునియా ప్రశ్నించారు.