
US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఒక వారంలో మూడో మరణం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో మూడో భారతీయ విద్యార్థి మృతి చెందడం గమనార్హం.
అయితే తాజాగా చనిపోయిన విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
25 ఏళ్ల వివేక్ సైనీని సోమవారం డ్రగ్స్‌కు బానిసైన ఓ దుండగుడు సుత్తితో కొట్టి చంపాడు.
ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మంగళవారం శవమై కనిపించాడు. ఇప్పుడు సిన్సినాటిలో మరో విద్యార్థి చనిపోవడం గమనార్హం.
సిన్సినాటి యూనివర్శిటీలో ఎంబీబీఎస్ చదవుతున్న 26 ఏళ్ల ఆదిత్యను గతేడాది నవంబర్‌లో దుండగుడు కాల్చిచంపాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వారం వ్యవధిలో మూడో విద్యార్థి మృతి
Another Indian student was found dead in Cincinnati US. Watch this report #US #IndianStudent | @shivaroor pic.twitter.com/3sXNpPbKl0
— IndiaToday (@IndiaToday) February 1, 2024