తదుపరి వార్తా కథనం

హైదరాబాద్‌లోని పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన; సోషల్ మీడియాలో వీడియో వైరల్
వ్రాసిన వారు
Stalin
May 30, 2023
06:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌లో వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారు.
పాములు,తొండలు, కుక్కలు, ఊసరవెల్లి, పిల్లి, డ్రాగన్ లాంటి వన్యప్రాణులను ప్రాణులను పట్టుకొని డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
దీంతో జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సాక్ష్యాధారాలతో సహా ఆశీష్ చౌదరి అనే యువకుడు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు.
అయితే ఈ జంతువులకు సంబంధించి అవసరమైన పత్రాలు (రిజిస్ట్రేషన్/లైసెన్స్) తమ వద్ద ఉన్నాయని, వాటిని విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు క్లబ్ యాజమాన్యం పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Lol okay. pic.twitter.com/TdRQByEQQU
— Ashish Chowdhury (@ash_chowder) May 30, 2023
మీరు పూర్తి చేశారు