LOADING...
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో అనలాగ్‌ ఏఐ సీఈవో భేటీ 
సీఎం రేవంత్‌రెడ్డితో అనలాగ్‌ ఏఐ సీఈవో భేటీ

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో అనలాగ్‌ ఏఐ సీఈవో భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనలాగ్ ఏఐ సంస్థ అధినేత అలెక్స్ కిప్‌మాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు, అలాగే వరదల నియంత్రణకు కృత్రిమ మేధస్సు సాంకేతికతను వినియోగించే అంశంపై సీఎం ఆయనతో చర్చించారు. 'ఫ్యూచర్ సిటీ', 'ఏఐ సిటీ' ప్రణాళికలు, మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ వివరాలను కిప్‌మాన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా కిప్‌మాన్‌ను సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారు.

వివరాలు 

నేత కార్మికుల రుణమాఫీ - 33 కోట్ల విడుదల

నేత కార్మికులకు రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం రూ.33 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనలాగ్ ఏఐ ఫౌండర్,​సీఈవో అలెక్స్‌తో రేవంత్ రెడ్డి భేటీ