LOADING...
Ancient Vishnu idol: కర్ణాటకలోని కృష్ణా నదిలో వేల ఏళ్లనాటి విష్ణువు విగ్రహం లభ్యం
Ancient Vishnu idol: కర్ణాటకలోని కృష్ణా నదిలో వేల ఏళ్లనాటి విష్ణువు విగ్రహం లభ్యం

Ancient Vishnu idol: కర్ణాటకలోని కృష్ణా నదిలో వేల ఏళ్లనాటి విష్ణువు విగ్రహం లభ్యం

వ్రాసిన వారు Stalin
Feb 07, 2024
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గల కృష్ణా నదిలో పురాతన విష్ణువు విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం ఈ విగ్రహం ఇటీవల అయోధ్యలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని పోలి ఉన్నట్లు నిపుణులు చెబుతన్నారు. ఈ విగ్రహం 11, 12వ శతాబ్దానికి చెందినదిగా నిపుణులు చెబుతున్నారు. కృష్ణా నదిలో విష్ణువు విగ్రహంతో పాటు వేల సంవత్సరాల నాటి శివలింగం కూడా లభ్యమైంది. ఆర్కియాలజీ లెక్చరర్ డాక్టర్ పద్మజ దేశాయ్ మాట్లాడుతూ.. ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. విష్ణువు చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన్, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి వంటి 'దశావతారాన్ని' వర్ణించేేది ఉందని వివరించారు.

విగ్రహం

వేంకటేశ్వరస్వామి పోలికలతో విగ్రహం

ఈ విగ్రహంలో విష్ణువు నిలువెత్తు భంగిమలో, నాలుగు చేతులు కలిగి ఉంటాడని శాస్త్రవేత్త పద్మజ దేశాయ్ తెలిపారు. ఈ విగ్రహం వేంకటేశ్వరుని పోలి ఉంటుందని గ్రంథాల్లో పేర్కొన్నారు. ఈ విగ్రహం ఏదో ఒక ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించబడినదిగా దేశాయ్ వివరించారు. ఆలయాన్ని కూల్చివేసే క్రమంలో ఈ విగ్రహాన్ని నదిలో విసిరివేసి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విగ్రహం క్రీస్తుశకం 11వ లేదా 12వ శతాబ్దానికి చెందినదని నిపుణులు భావిస్తున్నారు. విగ్రహాన్ని నదిలో పడేయడం వల్ల ముక్కు భాగం కాస్త దెబ్బతిన్నట్లు దేశాయ్ వెల్లడించారు. శ్రీమహావిష్ణువుకు అలంకార ప్రియుడని, అందుకే ఆయన విగ్రహాన్ని దండలు, ఆభరణాలతో అలంకరించినట్లు చెక్కినట్లు చెప్పారు.

Advertisement