Andhra Pradesh: 19కి చేరిన కరోనా కేసులు.. కడప జిల్లాలోనే 8 పాజిటివ్ కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 19కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు,కాకినాడ జిల్లాల్లో రెండేసి కేసులు వెలుగుచూడగా,పార్వతీపురం మన్యం,విశాఖపట్నం, తూర్పుగోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. మొత్తం బాధితుల్లో నలుగురు మృతిచెందగా, ముగ్గురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో నలుగురు హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తాజాగా నమోదైన కరోనా కేసులకు ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కారణమని ప్రభుత్వం గుర్తించింది. వైరస్ వ్యాప్తి పరిస్థితులను రాష్ట్ర సర్వైలెన్స్ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీలో కరోనా విజృంభణ: 19కి చేరిన కేసులు..
ఏపీలో కరోనా విజృంభణ: 19కి చేరిన కేసులు..కడప జిల్లాలోనే అత్యధికం!https://t.co/loMXM0gCx0
— Newsmeter Telugu (@NewsmeterTelugu) July 21, 2026