Page Loader
Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 
Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి

Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Dec 23, 2023
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లా కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బియ్యపు బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సాగర్‌ తెలిపారు. మృతులు చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా గుర్తించారు. వీరు అనంతపురం జిల్లా గూటి మండల వాసులు. బస్సు బలంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమై రోడ్డుకు అడ్డంగా బియ్యం బస్తాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన.. పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు