Page Loader
ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు 
ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు 

వ్రాసిన వారు Stalin
Aug 29, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతిక యుగంలో అన్ని అరచేతిలోనే జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పేపర్ వర్క్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించింది. సర్టిఫికెట్లను డిజిటల్ పద్ధతిలో జారీ చేసేందుకు జగన్ సర్కార్ కొత్త సాఫ్ట్ వేర్‌ను తీసుకొస్తోంది. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌ (కార్డ్‌)కు కొత్త వెర్షన్ కార్డ్ 2.0ను ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది. దీనికి 'కార్డ్‌ ప్రైమ్‌' అనే పేరును కూడా పెట్టింది. 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అంతేకాకుండా డాక్యుమెంట్ల రాయడానికి కూడా ప్రత్యేకంగా రైటర్లు అవసరం లేదు.

ఏపీ

వ్యతిరేకిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్స్‌ 

'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ ద్వారా సొంతంగా ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను తయారు చేసుకొని, చలానా కట్టి, స్లాట్‌ను బుక్ చేసుకుంటే సరిపోతుంది. స్లాట్‌లో ఇచ్చిన సమయం ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కానీ, గ్రామ, వార్డు సచివాలయంలో గానీ వెళితే, మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ కొత్త సాఫ్ట్ వేర్‌ను ఆగస్టు 31నుంచి రిజిస్ట్రేషన్ ఉపయోగించనున్నట్లు స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు అన్ని ఆఫీసుల్లో 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తుందన్నారు. సాఫ్ట్ వేర్‌ను డాక్యుమెంట్‌ రైటర్స్‌ వ్యతిరేకిస్తున్నారు. ఇది రావడం వల్ల తమకు ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.