LOADING...
Andhra Pradesh: ప్రొఫెసర్‌ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే  
ప్రొఫెసర్‌ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే

Andhra Pradesh: ప్రొఫెసర్‌ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా స్థాపించిన ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌ స్థాయి పదవుల నియామకం నిర్దేశిత సమయంలో పూర్తి కాకపోవడంతో,2025-26 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అదనపు సీట్ల మంజూరుకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)అనుమతి ఇవ్వలేదు. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం ప్రొఫెసర్‌ నియామకాలు చేపట్టినా,అప్పటికే ఎన్‌ఎంసీ తన నిర్ణయాన్ని ఖరారు చేసి ఉండటంతో రాష్ట్రం మొత్తం 44 పీజీ,50 యూజీ అదనపు సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక మూడోదశ కౌన్సెలింగ్‌ త్వరలో ముగియనున్న నేపథ్యంలో,ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని తాజా పరిస్థితిని ఎన్‌ఎంసీ దృష్టికి చేర్చాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ పూర్తయ్యాక ఆ వివరాలను ఎన్‌ఎంసీకి సమయానుకూలంగా తెలియజేయకపోవడమే సీట్ల రద్దుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.