తదుపరి వార్తా కథనం
చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్
వ్రాసిన వారు
Stalin
Apr 28, 2023
04:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఓ ఏనుగుకు బాగా దాహం వేసింది. దీంతో దగ్గర్లో చెరువు, కుంట కోసం వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో సమీపంలో ఉన్న చేతిపంపు నీరు తాగి తన దాహార్తి తీర్చుకోవాలనుకుంది.
ఈ క్రమంలో ఏనుగు అదే స్వయంగా చేతి పంపును కొట్టుకొని నీళ్లు తాగడం స్థానికంగా ఉన్నవారిని ఆశ్చర్యపర్చింది.
ఏనుగు
నాలుగు రోజుల క్రితం ఘటన ఆలస్యంగా వెలుగులోకి
ఏనుగు చేతిపంపును కొట్టుకొని నీళ్లు తాగుతున్న వీడియోను స్థానికులు సోషల్ మీడయాలో షేర్ చేయగా, విపరీతంగా వైరల్ అయ్యింది.
దాదాపు నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా పుణ్యమా అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది.
నాలుగైదేళ్ల క్రితం ఎనిమిది ఏనుగులు ఉన్న ఒక మంద కొమరాడ మండలంలో తిరుగుతోంది. అందులోని ఒక ఏనుగే ఇప్పుడు చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగింది.