
Andhra Pradesh: ఎర్రచందనాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్‌కి రూ. 82 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎర్రచందనం వృక్ష జాతి, ఇది అంతరించే జాబితాలో ఉండటంతో, దాని సంరక్షణ కోసం రూ. 82 లక్షలు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ (NBA) ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలికి అందించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం లక్ష ఎర్రచందనం మొక్కలను పెంచి రైతులకు సరఫరా చేయడం. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన ఎర్రచందనం మొక్కలను అడవుల వెలుపల పెంచడం ద్వారా వాటి సంరక్షణ సాధ్యం అవుతుందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పేర్కొంది.
Details
ఇప్పటికే అటవీశాఖకు రూ.31.15 కోట్లు నిధులు
ఈ మొక్కలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నా, వాణిజ్య విలువ కారణంగా స్మగ్లింగ్ జరుగుతున్నది. ఇప్పటివరకు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ఈ జాతి సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు రూ.31.15 కోట్లు విడుదల చేసింది. కొత్తగా మంజూరైన రూ.82 లక్షలను జీవవైవిధ్య నిర్వహణ సంఘాల సహకారంతో ఈ మొక్కల సంరక్షణ కార్యకలాపాలకు వినియోగిస్తారు.