LOADING...
Tirumala: తిరుమల దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిక్లరేషన్ తప్పనిసరి
తిరుమల దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిక్లరేషన్ తప్పనిసరి

Tirumala: తిరుమల దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిక్లరేషన్ తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమలలోని శ్రీవారి ఆలయ పవిత్రతను సంరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దర్శనానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందిగా టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉన్నప్పటికీ, అది కఠినంగా అమలు కాలేదని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు భక్తులు స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇస్తుండగా, మరికొందరు ఇవ్వకుండానే దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.

వివరాలు 

స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం పరిశీలన

ఇకముందు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుమల ఆలయ ఆచారాలు, సంప్రదాయాలు, పవిత్రతను కాపాడడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన చాంబర్‌లో మంత్రులతో సమావేశమయ్యారు. తిరుమలలో ఎటువంటి అపచారాలు, అవకతవకలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంలో స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

వివరాలు 

తిరుమలలోనూ కొత్త చట్టం

అదే తరహాలో తిరుమల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్వర్ణ దేవాలయం చట్టంపై సమగ్ర అధ్యయనం అనంతరం ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత కొత్త చట్టం అమలులోకి రానుంది. ఇటీవల తిరుమల చుట్టూ పలు వివాదాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కఠిన నిబంధనలను చట్టబద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

వివరాలు 

తిరుమలలోనూ కొత్త చట్టం

గత ఏడాది నుంచి తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సిట్ దర్యాప్తు నిర్వహించి కల్తీ జరిగినట్టు నిర్ధారించినట్లు సమాచారం. అయితే వైసీపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఎలాంటి కల్తీ జరగలేదని వాదిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశంపై తీవ్ర రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.

Advertisement