Kandula Durgesh: ఉగాదికి నంది అవార్డులు,నంది నాటకోత్సవాలు : కందుల దుర్గేష్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సమావేశం మొదటగా సినిమాటోగ్రఫీ, హోంశాఖల నేతృత్వంలో ఉన్నతాధికారులతో జరగనుంది. ఇందులో ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, ఏపీలో షూటింగ్ చేసే సినిమాలు, హై బడ్జెట్ చిత్రాల టికెట్ రేట్లపై చర్చలు జరగనున్నాయి. అధికారుల సమావేశం అనంతరం, సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు.
వివరాలు
ఏపీలో షూటింగ్ చేసే సినిమాలకు ప్రోత్సాహకం
ఈ సమావేశానికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, ఏపీలో షూటింగ్ చేసే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అంతే కాకుండా, ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు.